భారతదేశ రూపురేఖలు మార్చిన మన్మోహన్ సింగ్

63చూసినవారు
భారతదేశ రూపురేఖలు మార్చిన మన్మోహన్ సింగ్
భారతదేశ రూపురేఖలను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మార్చేశారు. ఆయన ప్రధానిగా 2004 నుండి 2014 వరకు సేవలందించారు. ఆయన నాయకత్వంలో 8-9 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించింది. భారతదేశం గ్లోబల్ న్యూక్లియర్ కమ్యూనిటీలోకి ప్రవేశించేందుకు 2008 అమెరికా- భారత పరమాణు ఒప్పందం మైలురాయిగా నిలిచింది. 2005లో ప్రవేశపెట్టిన నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ రైతులకు, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, పేదరిక నిర్మూలనలోనూ ఆయన ఎంతో కృషి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్