ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్డు విసిరారు. బెంగళూరు పశ్చిమ ప్రాంతంలో ఉన్న లగ్గెరే, లక్ష్మీదేవి నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మునిరత్న పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.