కోయిలకొండ: కాంగ్రెస్ నేతల అభినందనలు
నారాయణపేటలోని శీల గార్డెన్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా వార్ల విజయకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా శనివారం కోయిలకొండ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖాతల్ హుస్సేన్, నరసింహులు గౌడ్, రామచంద్రయ్య, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.