భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లు అంతరిక్షంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిని కాపాడేందుకు గాను జరిపిన చర్చల్లో నాసా & బోయింగ్ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని నివేదికలు తెలిపాయి. తన స్టార్ లైనర్ క్యాప్సూల్ ద్వారా వారిని తీసుకురావొచ్చని బోయింగ్ చెప్పినప్పటికీ, నాసా ఒప్పుకోలేదని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. చివరికి బోయింగ్ ను కాదని, నాసా స్పేస్ఎక్స్ ను ఈ మిషన్ కు ఎంచుకుంది.