భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ ట్రైనింగ్ కోసం కేంద్రం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. నీరజ్ శిక్షణ కోసం రూ.5.72 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. అలాగే బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ట్రైనింగ్ కోసం రూ.3.13 కోట్లు, రెజ్లర్ వినేశ్ ఫొగట్ శిక్షణ కోసం రూ.70.45 లక్షలు ఖర్చు చేసినట్లు ఓ వార్తా పత్రిక ప్రచురించింది.