బీహార్, కేరళ రాష్ట్రాలకు కొత్తగా ఎంపికైన గవర్నర్లు ఇవాళ పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటివరకూ కేరళ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బీహార్ గవర్నర్‌గా ప్రమాణం చేశారు. అలాగే, ఇన్ని రోజులూ బీహార్ గవర్నర్‌గా విధులు నిర్వహించిన రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.