కొత్త మారుతి సుజుకి డిజైర్ ఇవాళ అధికారికంగా భారత మార్కెట్‌లోకి విడుదలైంది. దీని రాక కోసం ఆటోమోబైల్ ఔత్సాహికులతో పాటు కారు ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధర రూ.6.79 లక్షల నుంచి ప్రారంభంకానుంది. గ్లోబల్ ఎన్‌క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన తొలి మారుతీ సుజుకీ కారు ఇదే కావడం గమనార్హం. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఈ కాంపాక్ట్ సెడాన్ 5 స్టార్ రేటింగ్ సాధించింది.