టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

82చూసినవారు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రెండో సెమీస్‌ మ్యాచ్ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య లాహోర్‌ వేదికగా జరగనుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. న్యూజిలాండ్ మాత్రం జట్టులో మార్పులేవీ చేయలేదు. ఇక ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచే జట్టు.. టైటిల్‌ కోసం టీమ్‌ఇండియాతో తలపడాల్సి ఉంది.