ప్రైవేటు ఆస్పత్రులన్నీ రోగులు, వారి బంధువులతో బలవంతంగా అధిక ధరలతో కూడిన మందులను కొనుగోలు చేయిస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంలో విచారణ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ఔషధాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని అత్యున్నత న్యాయస్థానం విమర్శించింది. ప్రభుత్వాల వైఫల్యమే ప్రైవేటు ఆస్పత్రులకు ప్రోత్సాహకంగా మారిందని సుప్రీం కోర్టు మండిపడింది.