జమ్మూకశ్మీర్‌లో మంగళవారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడా వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాంబన్‌లోని మెహద్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.