తమిళనాడులోని మదురై జిల్లా సాలుప్పపట్టి గ్రామానికి చెందిన ముత్తు ఇండో టిబెటన్ బోర్డర్‌లో పని చేస్తున్నారు. ఆయన తల్లి వెలైతాయి (67) గ్రామానికి చెందిన కొందరితో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. గత నెల 10వ తేదీన లడ్డూ కౌంటర్ వద్ద తప్పిపోగా.. ఇప్పటివరకూ ఆమె ఆచూకీ దొరకలేదు. తల్లి ఫోటో తీసుకుని ముత్తు తిరుమల, తిరుపతిలో కొద్ది రోజులుగా గాలిస్తున్నారు. ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్ వద్ద తన తల్లి ఫోటో చూపిస్తూ ఆచూకీ చెప్పాలని వేడుకున్నారు.