ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జనరంజక పాలన చూసి బీఆర్‌ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మామడ మండలం పరిమండల్, జగదాంబ తండాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ను వీడి గులాబీ గూటికి చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.