కడెం మండలంలోని అన్ని గ్రామాలలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం కడెం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అరుణ, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి, విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ సుమన్ కుమార్ జాతీయ జెండాలను ఎగురవేశారు. పలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో హెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు.