మామడ: వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం మామడ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కమ్మర్ పల్లికి చెందిన వికాసిని (24) న్యూ లింగంపల్లికి చెందిన నవీన్ తో 2019లో వివాహం చేయగా రూ. 3లక్షలు, 2తులాల బంగారాన్ని వరకట్నం ఇచ్చి వివాహం చేశారు. కొన్ని రోజుల నుంచి అదనపు కట్నం రూ. 50, 000 తేవాలని తరచుగా వేధిస్తుండడంతో మానసికంగా కుంగిపోయి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.