ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహాలు ఢీ
మామడ మండలం అరేపల్లి గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం రచ్చకోట గ్రామానికి చెందిన సురేష్, సోమ్ పేట్ గ్రామానికి చెందిన మరో వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.