బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'సిరిసిల్ల కలెక్టర్ లాంటి సన్నాసులను తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నారు. ఏం చేసినా ఫరక్ పడదు. బీఆర్ఎస్ వెంట్రుక కూడా పీకలేరు. కలెక్టర్లు, పోలీసులు, అధికారులు ఎన్నిరోజులు నాటకాలు చేస్తారో చూద్దాం. రాసిపెట్టుకోండి నేను అంత మంచివాడిని కాదు. ఇవాళ ఎవరైతే అతి చేస్తున్నారో వడ్డీతో సహా తిరిగిచ్చే బాధ్యత నాది' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.