అదానీ, దాని అనుబంధ సంస్థలు.. సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు పెద్ద ఎత్తున లంచాలు ఆఫర్ చేశారన్న ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదవ్వడం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా అదానీ గ్రూప్‌నకు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ కేసుకు సంబంధించి గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్‌పై లంచం అభియోగాలు నమోదైనట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.