ఉత్తరప్రదేశ్ లోని సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు వైద్యులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. వైద్యులంతా లక్నో నుంచి ఆగ్రాకు స్కార్పియోలో వెళుతుండగా, వారి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వీరంతా పీజీ విద్యార్థులే. కారులో ఉన్న మరో పీజీ విద్యార్థికి తీవ్రగాయాలై ఆస్పత్రిలో చేరారు.