పంట నాశనం చేస్తున్న పందులు. పరేషాన్ అవుతున్న రైతులు
మామడ మండలంలోని ఆయా గ్రామాల్లోని పంటలపై పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను పందులు నాశనం చేస్తుండటంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. పండించిన పంట చేతికి వచ్చేవరకు ఆ పంటను రక్షించుకోవడానికి ఒక్కో రైతు ఒక్కో పద్ధతి పాటిస్తున్నాడు. పందులు పంటలను నాశనం చేస్తుండటంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలీక రైతులు భయపడుతున్నారు.