కిటకిటలాడుతున్న బాసర అమ్మవారి ఆలయం

50చూసినవారు
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రావణ శుక్రవారం శుభదినం తో కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధికంగా తరలి వచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది.

సంబంధిత పోస్ట్