బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తిక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.