బాసర మండల కేంద్రంలో మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగిన పాపహారేశ్వర ఆలయ పునః ప్రాణ ప్రతిష్ట వేడుకలు సోమవారం తో ముగిశాయి. ఈ సందర్భంగా వేడుకల్లో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామరావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. అంతరం భక్తులకు అన్నదానం చేశారు.