లబ్ధిదారులకు సిలిండర్ బాండ్ల పంపిణీ

65చూసినవారు
లబ్ధిదారులకు సిలిండర్ బాండ్ల పంపిణీ
ముధోల్ మండలంలోని అష్ట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ. 500 కి గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సుకన్య రమేష్, నాయకులు రావుల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో దాదాపు 300 మంది లబ్ధిదారులకు బాండ్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ముందుకు వెళ్తుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్