బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు

67చూసినవారు
భైంసా పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి విలాస్ గాదేవర్ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకమంది త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చారన్నారు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్