ముధోల్: సోయా ట్రాక్టర్ బోల్తా

66చూసినవారు
చేతికి వచ్చిన పంట నీటి పాలైన ఘటన బుధవారం ముధోల్ మండల కేంద్రంలో జరిగింది. రైతు సాయినాథ్ తెలిపిన వివరాల మేరకు బుధవారం సోయా పంటను కోసి ఇంటికి తీసుకువచ్చే క్రమంలో వాగులో ట్రాక్టర్ బోల్తా పడిందని తెలిపారు. వాగు పై వంతెన నిర్మాణం లేకపోవడంతో పంట ట్రాక్టర్ బోల్తా పడి పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. 30 సంచుల సోయా నీళ్లలో తడిచిపోయిందని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్