Oct 24, 2024, 01:10 IST/ముథోల్
ముథోల్
కుంటాల: సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చు.. ఎస్ఐ
Oct 24, 2024, 01:10 IST
సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని కుంటాల ఎస్ఐ భాస్కర చారి అన్నారు. బుధవారం పోలీస్ స్టేషన్ లో మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులకు సీసీ కెమెరాలతో కలిగే ప్రయోజనాలను వివరించారు. రద్దీ ప్రదేశాలు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఆలయాల్లో దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు బిగించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.