ముదిరాజ్ లను బీసీ డీ నుండి బీసీ ఏ కి మార్చాలని వినతి
నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండల కేంద్రంలో సోమవారం ఉదయం స్థానిక ముదిరాజ్ సభ్యులు అందరూ కలిసి స్థానిక మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి అభయ హస్తంలో ఇచ్చిన మాటను అనగా ముదిరాజులను బిసి డి నుండి బీసీ ఏ లోకి మార్చే ప్రక్రియ వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంగం అధ్యక్షులు గడ్డం దేవేందర్, కోశాధికారి కేశవ్, కోర్ కమిటి సభ్యులు ఉమా మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.