బీజేపీ లీగల్ సెల్ అధ్వర్యంలో న్యాయవాదుల సంబురాలు

79చూసినవారు
బీజేపీ లీగల్ సెల్ అధ్వర్యంలో న్యాయవాదుల సంబురాలు
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీజీ మూడవ సారి అధికారం చేపట్టడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ లీగల్ సెల్ అధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఇందులో జిల్లా కన్వీనర్ వి. వి రమణ రావు, న్యాయవాదులు శుభకరన్, నూనె గంగాధర్, ఓస మహేందర్, కొమ్మోజి రమణ, రాజేశ్వర్, రత్నం, రాజు, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.