సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన 47 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు లబ్దిదారులకు సోమవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంప్ కార్యాలయంలో చెక్కులను అందజేశారు.