బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఆర్మూర్ వాసి మృతి

80చూసినవారు
బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఆర్మూర్ వాసి మృతి
మాక్లూర్ మండలం రామచంద్రపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెర్కిట్ కి చెందిన పుచ్చుల సుమన్(35) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ కు బైకుపై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్టిగా కారు TS16FA8901 గల వెనకాల నుండి ఢీకొట్టడంతో పక్కనున్న వరి కుప్పలో పడి మృతి చెందాడు. పెర్కిట్ కు చెందిన సుమన్ తూనికలు, కొలతల శాఖలో పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్