ఆలూర్ మండల కేంద్రంలో మల్లయ్య (కండే రాయుడు) జాతరను ఆదివారం భక్తులు ఘనంగా నిర్వహించారు. బోనాలను గ్రామం నుంచి మల్లన్న ఉన్న ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రధోత్సవం నిర్వహించగా రథం లాగడానికి భక్తులు పోటీపడ్డారు. భారీగా తరలి వచ్చిన భక్తుల కోసం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.