తన కుమారుడిని యూరప్ పంపిస్తానని ఏజెంట్ మోసం చేయడంతో మనస్తాపానికి గురైన తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఆర్మూర్ పట్టణంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రాజేష్ లాల్(55) తన కుమారుడు సృజన్‌ను యూరప్ పంపడానికి ఆర్మూర్‌కు చెందిన ప్రసాద్ అనే ఏజెంట్‌కు రూ. 10 లక్షలు చెల్లించాడు. అయితే సదరు ఏజెంట్ సృజన్‌ని యూరప్ కాకుండా కజకిస్తాన్ పంపించడంతో తిరిగి ఇండియాకు వచ్చాడు. అనంతరం గుండెపోటు వచ్చి మృతి చెందాడు.