నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలోని ముదిరాజ్ కాలనిలో మంగళవారం దుర్గామాత 6వ రోజు అవతారంలో భాగంగా మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చింది. అమ్మవారికి కమిటీ సభ్యులు 16 లక్షల రూపాయలతో అలంకరించారు. భారీ మొత్తంలో నగదుతో అలంకరించడంతో మాతను వీక్షించడానికి భక్తులు తరలివచ్చారు. తదనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.