నిజామాబాద్: మద్యం ధరలు పెంచేందుకు సర్కార్‌ కసరత్తు?

82చూసినవారు
నిజామాబాద్: మద్యం ధరలు పెంచేందుకు సర్కార్‌ కసరత్తు?
మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నాలుగేళ్లుగా మద్యం ధరలు పెంచకపోవడంతో కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఆరు నెలల క్రితమే ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే మద్యం ధరలు తక్కువగా ఉండడంతో మద్యం ధరలు పెంచేందుకు ఆబ్కారీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.