నిజామాబాద్: కళాశాలలో మెరుగైన వసతుల ఏర్పాటుకు కృషి
నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అన్ని విధాలుగా మెరుగైన వసతులను అందించేందుకు కృషిచేస్తున్నామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవికుమార్ తెలిపారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధనతో పాటు పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాలలో అధ్యాపకుల కొరతలేదని, కొరత ఉన్న కళాశాలలో సర్దుబాటు చేశామని తెలిపారు.