ఏడపల్లి మండలం తానాకలాన్ గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బోనాలను తీసిన భక్తులు మేళతాళాలు డప్పు వాయిద్యాల మధ్య సంప్రదాయ రీతిలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామ శివారులోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో బోనాల తో పాటు సాంప్రదాయ నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.