ఆర్మూర్: మొదలైన సమగ్ర కుటుంబ సర్వే
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే బుధవారం ప్రారంభమైంది. ఈ సర్వేను మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజులు పరిశీలించారు. అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్న తీరును పరిశీలించారు. ప్రజలు సర్వేకు వచ్చిన సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.