వైద్య విద్యార్థినిపై హత్యాచారం చేయడం అమానుషం

81చూసినవారు
పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో వైద్య విద్యార్థిని అత్యాచారం చేయడం అమానుషమని నవీపేట్ మండల వైద్య సిబ్బంది శనివారం ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రాణాలను కాపాడే వారిని అత్యాచారం చేసి చంపి వేయడం చాలా అమానుషమని అన్నారు. వెంటనే అటువంటి కామాంధులను శిక్షించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు. మండల వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్