నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పోలీస్ స్టేషన్లో బోధన్ డివిజన్ ACP పి. శ్రీనివాస్, బోధన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ బాబుచే వార్షిక తనిఖీలను సోమవారం రోజున నిర్వహించారు. ఈ తనిఖీలలో రికార్డ్స్ పరిశీలించడంతో పాటు, సిబ్బంది విధులకు సంబంధించి ప్రత్యేక సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ACP శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సై మరియు వారి బృందానికి సూచనలను ఇస్తూ ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.