బోధన్: బీరప్ప ఆలయ నిర్మాణానికి భూమి పూజ

55చూసినవారు
బోధన్: బీరప్ప ఆలయ నిర్మాణానికి భూమి పూజ
కురుమల ఆరాధ్య దైవం బీరప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి బోధన్ మండలం కల్దుర్కి కురుమ సంఘం నాయకులు భూమి పూజ చేశారు. కల్దుర్కి గ్రామ శివారులో ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమి ని సంబాజీ నీలకంఠం అందజేశారు. ఈ స్థలంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆలయ నిర్మాణానికి పూజ నిర్వహించారు. బీరప్ప దేవాలయ నిర్మాణానికి సంబాజీ నీలకంఠం, విజయ్ కుమార్ తమ స్థలాన్ని కేటాయించడం పట్ల కురుమ సంఘం నాయకులు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్