బోధన్ మండలం సాలూర గ్రామంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఒక వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దాంతో అతనికి తీవ్రగాయాలు కాగా స్థానికులు గమనించి 108 కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బోధన్ 108 సిబ్బంది లక్ష్మణ్ మరియు కేశవ్ కుమార్ లు అతనికి ప్రథమ చికిత్స చేసి బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.