ఎన్నాళ్ళీ నిరీక్షణ..!

1249చూసినవారు
ఎన్నాళ్ళీ నిరీక్షణ..!
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలురా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మిస్తున్న అదనపు గది నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. ఆసుపత్రిలో నిరీక్షణ గది కోసం రూ. 5 లక్షలు మంజూరు అవగా రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించిన ఇంత వరకు పూర్తికాలేదు. పిహెచ్ సి కి వచ్చే రోగులు, గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు దృష్టి సారించి పనులు తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్