నిజామాబాద్ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు By సయ్యద్ బాబు 57 చూసినవారు Jan 07, 2025, 16:01 IST నిజామాబాద్ జిల్లా ఓటర్ల వివరాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు వెల్లడించారు. జిల్లాలో 14, 35, 214 ఓటర్లు ఉండగా పురుషులు 6, 77, 130 మంది, స్త్రీలు 7, 58, 005 ఇతరులు 79 మంది ఉన్నారని తెలిపారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో 2, 14, 136 (99, 657 పురుషులు, 1, 14, 473 స్త్రీలు, 6 ఇతరులు), బోధన్ నియోజకవర్గంలో 2, 24, 772(1, 06, 999 పురుషులు, 1, 17, 768 స్త్రీలు, 5 ఇతరులు), బాన్సువాడ నియోజక వర్గంలో 1, 98, 738 (94, 577 పురుషులు, 1, 04, 145 స్త్రీలు, 16 ఇతరులు) బాల్కొండ నియోజకవర్గంలో 2, 29, 624 (1, 06, 108 పురుషులు, 1, 23, 512 స్త్రీలు, 4 ఇతరులు) నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 3, 07, 459(1, 48, 162 పురుషులు, 1, 59, 255 స్త్రీలు, 42 ఇతరులు )నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2, 60, 485(1, 21, 627 పురుషులు, 1, 38, 852 స్త్రీలు, 6 ఇతరులు) ఉన్నారు.