గ్రామీణ అభివృద్ధి స్వావలంబన దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమని చాటి చెప్పిన వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని కామారెడ్డి ఎమ్యెల్యే కెవి. రమణారెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బీజేపీ ఆఫీసులో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సంధర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దయాల్ ఆదర్శంతోనే బీజేపీ ముందుకు నడుస్తుందన్నారు. బీజేపీ మూల సిద్ధాంత కర్త, దేశం కోసం పరితపించిన జాతీయవాదన్నారు.