కామారెడ్డిలో జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి ప్రారంభం అయిన గణపతుల నిమజ్జన శోభయాత్రలో పోలీసులు తమపై లాఠీ ఛార్జ్ చేసినట్లు పలు గణేష్ మండపాల యువకులు ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. పట్టణంలోని పాన్ చౌరస్తా వద్ద పోలీసులు వినాయక నిమజ్జన నిర్వహకులపై లాఠీ చార్జ్ చేశారు. తమపై పోలీసులు కారణం లేకుండా లాఠీఛార్జ్ చేశారని వారు ఆరోపిస్తూ.. లాఠీ ఛార్జీ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.