డీఎస్సీ 2024లో క్వాలిఫై అయిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన తీరును గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 1240 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అందరి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.