మెండోరా మండలం - Mendora Mandal

నిజామాబాద్ జిల్లా
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేది కాంగ్రెస్ పార్టీ..జీవన్ రెడ్డి
May 07, 2024, 05:05 IST/

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేది కాంగ్రెస్ పార్టీ..జీవన్ రెడ్డి

May 07, 2024, 05:05 IST
చక్కర కర్మాగారం పునఃరిద్దరిస్తం.. ఎంపీగా గెలిపించండి.. సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్లో గళంఎత్తుతా.. ప్రతి మహిళా సంఘానికి వడ్డీ లేకుండా రుణాలు అందిస్తాం.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం.. అందుబాటు లోనుండి సేవలు అందిస్తా.. నవీపేట్ మండల కేంద్రం.. రెంజల్ మండలంలోని సాటాపుర్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభివృద్ధి జీవన్ రెడ్డి ముమ్మర ప్రచారం.. టపాసులు పేల్చి.. శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం.. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు అంటూ నినాదాలతో దద్దరిల్లిన సమావేశాలు.. మీ మద్దతు కోసం వచ్చిన.. ఆశీర్వదించండి..అందుబాటు లో ఉండి సేవలు అందిస్తానని జీవన్ రెడ్డి భరోసా .. తరలివచ్చిన వందలాది మంది మహిళలు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు.. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,ఉర్దూ అకాడెమీ చైర్మన్ తహేర్ బిన్ హాందాని, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపించిన తర్వాత ఉపాధి హామీ కూలికి రోజుకు 400 కూలి అందిస్తామన్నారు. ఇంటికొ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వని కేసీఆర్ ను ఇంటికి పంపించారు.. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వని మోడీని సైతం ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించిన ఘనత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ది అని కొనియాడారు. 20 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంత రైతులకు విద్యుత్ బారం కాకూడదని, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ప్రారంభించింది. టిడిపి పాలనలో చక్కర కర్మాగారంలోని 51% శాతం వాటాను అమ్మకానికి పెట్టారు. తెలంగాణ ఏర్పాటు అనంతరమైన తెలంగాణ చక్కర కర్మాగారం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తుందని ఆశిస్తే..కవిత ఎంపీగా గెలిచిన అనంతరం మూసివేశారు. సీఎం రేవంత్ రెడ్డీ చక్కర కర్మగారాన్ని పున ప్రారంభించేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారు. చక్కెర కర్మాగారం సహకార సంఘం నడిపించుకోవాలని అమిత్ షా అన్నారు. రైతులపై భారం పడకుండా కాంగ్రెస్ పార్టీ వెయ్యి కొట్లు అయిన పెట్టుబడి పెట్టీ చక్కర కర్మాగారం ప్రభుత్వం నిర్వహిస్తుందని హామీ ఇచ్చారు. చక్కర కర్మాగారం తెరిపించేందుకు కృషి చేస్తున్న సుదర్శన్ రెడ్డికి అండగా నేను నిలబడతాను అంటూ జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేయాలంటే మాకే సంబంధం వాళ్లే కట్టుకోవాలంటూ బిజెపి ప్రభుత్వం చెబుతోంది. బడా వ్యాపార వేత్తలకు మాత్రం ఎన్ పీ ఏ పేరిట లక్షల కోట్లు మాఫీ చేసింది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏకమొత్తంగా లక్ష రూపాయలు మాఫీ చేసింది.. మరోసారి రెండు లక్షల రూపాయల రుణాలు వచ్చే ఖరీఫ్ నాటికి మాఫీ చేస్తాం. కవిత ఐదేళ్లు ఉంది రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించలేదు ప్రభుత్వ ఉండగా అరవింద్ ఐదేళ్లలో కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించలేదు. ఎంపీగా గెలిచిన సందర్భంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించడం నా బాధ్యతగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. బోధన్ నుండి బీదర్ వరకు రైల్వే లైన్ వేస్తాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం గృహ అవసరాలకు 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రు.500లకే సిలిండర్ అందిస్తున్నాం. టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఆగస్టు 15 నాటికి రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు అందజేస్తాం. సంక్షేమ పథకాలు అందని వారి వివరాలు సేకరిస్తే అందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తాం. బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డకు పిఎఫ్ పై ఏ విధమైన ఆంక్షలు లేకుండా 2000 పెన్షన్ను 4వేలకు పెంచి అందిస్తాం. బిజెపి పాలిత రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలంగాణ లో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు అమలు చేయడం లేదు.. గల్ఫ్ వెళ్ళిన కార్మికులను పదేళ్లుగా బిజెపి, బీ ఆర్ ఎస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాం.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ప్రభుత్వం ప్రతి నెలా రు.500 కోట్లు చెల్లిస్తుంది. పవిత్రమైన త్రివేణి సంగమం రెంజల్ మండలాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దుతా.. రైతు కష్టం తెలిసిన వ్యక్తిని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు పార్లమెంటులో గళమెత్తి పరిష్కరించేందుకు కృషి చేస్తా. ప్రజలు అండగా నిలిచి.. ఓటువేసి ఎంపీగా గెలిపించాలని జీవన్ రెడ్డి కోరారు.