వాగులో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మెండోరా మండలంలోని కుర్రు ప్రాంతంలో ముగ్గురు పశువుల కాపరులు చిక్కుకున్నారు. సోమవారం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తడంతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. తమను కాపాడాలని పశువుల కాపర్లు ఆర్తనాదాలు చేశారు. ముగ్గురు పశువుల కాపరులతో పాటు ఆశ్రమంలో 24 ఆవులు ఉన్నాయని స్థానికులు తెలిపారు.