
నిజామాబాద్: గుర్తు తెలియని మృతదేహం లభ్యం
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ గ్రామ శివారులోని చెరువులో సోమవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం మృతుడు తెలుపు బూడిద రంగు చొక్కా ధరించాడన్నారు. వయస్సు 30 నుండి 35 సంవత్సరాలు ఉండొచ్చన్నారు. వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని సూచించారు.