ఇందల్వాయి మండలంలో అప్పుల బాధతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని త్రియంబకపేట్ గ్రామానికి చెందిన బైరీ గణేశ్ (22) ఏడాది క్రితం బతుకుదెరువుకు సౌదీ వెళ్ళాడు. అక్కడ ఆరు నెలలు గడిపి సరైన ఉపాధి అవకాశాలు దొరక్క తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పులు అధికమవడంతో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.